జీవనశైలి, వ్యక్తిగత కారణాలు, తీసుకునే ఆహారం కారణంగా కొందరు పిల్లలు తొందరగా పెరగరు. పిల్లలు బరువుకు తగ్గ ఎత్తు ఉండాలి. ఎత్తు పెరిగే ఏజ్ ఉన్నా.. పొట్టిగానే ఉండిపోతారు. ఇలాంటి పిల్లలు ఎత్తు పెరగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

ఈ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి

పిల్లలను ఇంట్లోనే ఉంచకుండా బయట ఆడటానికి పంపించాలి. ముఖ్యంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. ఇవి చేయడానికి చాలా ఈజీగా ఉండటంతో పాటు పిల్లలు తొందరగా ఎత్తు పెరిగేలా చేస్తాయి. కూర్చుని కాళ్లు ముందుకు చాపి చేతి వేళ్లతో కాళ్లను అందుకోవడం, నిటారుగా నిల్చొని వంగి కాలి వేళ్లను అందుకోవడం వంటివి చేయడం పిల్లలకు అలవాటు చేయాలి. శారీరకంగా ఇలా వ్యాయామాలు చేయడం వల్ల పిల్లలు తొందరగా ఎత్తు పెరుగుతారు. అలాగే బార్ హ్యాంగింగ్స్, హ్యాంగింగ్ రాడ్, పులప్స్, చిన్-అప్స్ వంటి ఎక్సర్‌సైజ్‌లు పిల్లలతో చేయించడం వల్ల వెన్నెముక సులభంగా సాగుతుంది. ఈ వ్యాయామాలు ద్వారా ఫిట్‌గా ఉండటంతో పాటు ఎత్తుగా కూడా ఉంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సైకిల్ నడిపించడం, యోగా వంటివి అలవాటు చేయించాలి. ఇలా చేయించడం పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. స్కిప్పింగ్, స్విమ్మింగ్ వంటి ఎక్సర్‌సైజ్‌లు చేయించడంతో పాటు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకుంటే.. పిల్లలు బరువుకి తగ్గట్టుగా ఎత్తు పెరుగుతారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.