• దర్శన్ కేసులో కీలక పరిణామం..

  • యాక్టర్ నివాసంలో సోదాలు చేసేందుకు అనుమతి కోరిన ఐటీ శాఖ..

  • నేరానికి ఉపయోగించిన డబ్బులపై ఆరా..

Renukaswamy murder case: అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతర సహాయకులు కలిసి హత్య చేశారు.

దర్శన్ ఇంట్లో పత్రాలను తనిఖీ చేయాల్సిందిగా ఐటీ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. నేరానికి వినియోగించిన నగదుకు సంబంధించి దర్శన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐటీ అధికారులు బళ్లారి జైలుకు వెళ్లారు. దర్శన్ నేరాన్ని కప్పిపుచ్చడానికి మరియు అతని తరపున లొంగిపోవడానికి కొంతమందికి రూ.30 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఇతర నిందితులను చెల్లించేందుకు నటుడు దర్శన్ తన స్నేహితుల్లో ఒకరి నుంచి రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు హత్య కేసుకు సంబంధించిన ముందస్తు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించాడు.

Read Also: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడతో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ ముగ్గురిపై హత్యా నేరాలు ఎత్తివేశారు. జూన్ 9న బెంగళూర్‌లోని సుమనహళ్లి వంతెన వద్ద 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. దర్శన్ అభిమాని అయిన స్వామి, తన అభిమాన నటుడు భార్యని విడిచి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై ఆగ్రహంతో పవిత్ర గౌడకు సోషల్ మీడియా వేదిక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే ఈ హత్యకు కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి ఓ షెడ్డుకు తీసుకువచ్చి నిందితులు దాడి చేశారు. మృతదేహంపై మొద్దుబారిన గాయాలతో పాటు వృషణాలు పగిలిపోయిన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో జూన్ 11న నిందితులను అరెస్ట్ చేశారు.