• వరుస సినిమాలతో సూర్య ఫుల్ బిజీ
  • విడుదలకు రెడీ గా ఉన్న పాన్ ఇండియా చిత్రం కంగువ
  • కార్తీక్ సుబ్బరాజు సినిమాకు లో నటిస్తున్న సూర్య

తమిళ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత్తం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు రీడి గా ఉంది. ఇక సూర్య నటించే తర్వాతి సినిమాలపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు సూర్య. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Jr NTR : సమాజం పట్ల తన వంతు భాద్యతగా ‘దేవర’.. వీడియో రిలీజ్

కాగా సూర్య నటించే 45 వ సినిమాకు సంబంధించి ఓ వార్త తమిళ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించే సూర్య 45 సినిమాకు RJ బాలాజీ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం RJ బాలాజీ ఈ కథను T69 కోసం దళపతి విజయ్‌కి కథ చెప్పాడు, కానీ అక్కడ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను సూర్యతో తెరెకెక్కించనున్నాడు బాలాజీ. కాగ్ ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ A.R రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 24మూవీ తర్వాత సూర్య AR రెహమాన్ తో కలిసి మరోసారి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నుంచి చెన్నై లో RJ బాలాజీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. RJ బాలాజీ గతంలో నయన తార లీడ్ రోల్ లో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. సూర్యతో తెరకెక్కించే సినిమా పొలిటికల్ టచ్ తో కథ నేపథ్యం ఉంటుందని చెన్నై వర్గాల టాక్.