• శరవేగంగా అల్లు అర్జున్ పుష్ప -2 షూటింగ్
  • డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ ఫిక్స్
  • కాకినాడ రానున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా పైభారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు వెస్ట్ ఎట్టకేలకు డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమై షూటింగ్ బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read:  Harsha Sai : హర్ష సాయి కేసులో నిజానిజాలు.. పూసగుచ్చినట్టుగా..

కాగా పుష్ప -2 షూట్ ను రెండు యూనిట్స్ గా విభజించి షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఒక టీమ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తుండగా మరొక టీమ్ కాకినాడలో ఛేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాకినాడ బయలుదేరాడు. కాకినాడలో బన్నీ పై కొన్ని సీన్స్ తీయాల్సి ఉంది.ఆ అందుకోసమై కాకినాడ రేపు కాకినాడ రానున్నాడు బన్నీ. కాగా ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ భావిస్తోంది. కానీ నేరుగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాకినాడ షూట్ ముగించాక మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా అవి కూడా అక్టోబర్ రెండవ వారంలోపు షూట్ చేసి అదే నెల చివరి నాటికి గుమ్మడి కాయ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 75 రోజుల కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.