సాధారణంగా గ్రామాల్లో భోజనాలు ఉంటే ఎవరూ ఇంట్లో వండుకోరు. కానీ గుజరాత్‌లోని చందన్‌కీ గ్రామంలో ఏడాదిలో ఒక్కరోజూ కూడా ఇంట్లో వండుకోరు. ఈ గ్రామం మొత్తానికి కలిపి ఉన్న కమ్యూనిటీ హాల్‌లోనే అందరూ తింటారు. చిన్న గ్రామమైన చందన్‌కీలో 250 మందికి పైగా మాత్రమే జనాభా ఉంటారు. ఈ జనాభాలో ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఉండగా.. మిగిలినవారిలో యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిపోయేవారు. 

సంప్రదాయ గుజరాతీ భోజనం

వృద్ధులు వారు రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడేవారు. వీరి ఇబ్బందిని గమనించిన ఆ గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ అందరికీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. గ్రామంలో ఉన్నవారంతా కలిసి ఒకేసారి భోజనం చేస్తారు. ఇక్కడ రోజుకి రెండు పూటలు మాత్రమే భోజనం పెడతారు. ఒక్కో వ్యక్తి నెలకు 2000 రూపాయలు చెల్లిస్తే.. గుజరాతీ భోజనాన్ని అందిస్తారు. ఈ కారణంతో గ్రామంలోని ఒక్క కుటుంబం కూడా ఇంట్లో వండుకోరు. ఈ కమ్యూనిటీ హాల్‌లోనే భోజనం చేస్తారు.