• దేవర టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు
  • సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న దేవర
  • కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి అధిక ధరలకు టికెట్స్ అమ్మెందుకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆంధ్రలో మొదటి 14 రోజులు అధిక ధరకు అమ్మేలా జీవో ఇచ్చింది. సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవరకు 14 రోజులు పాటు అధిక టికెట్ ధరకు టికెట్స్ అమ్ముకునేలా జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ  ఏపీ హై కోర్టులో పిల్ దాఖలైంది.  ఆ పిల్ పై  విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..

హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని   పిటిషనర్ వాదనలు వినిపించాడు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది దేవర నిర్మాతలకు షాక్ తగిలిందనే చెప్పాలి. కాగా తెలంగాణాలో మొదటి రోజు మాత్రం ఒకరేటు, మిగిలిన 9 రోజులు మరొక రేట్ కు టికెట్ ధరలు నిర్ణయించింది. అయితే రెండవ రోజు నుండి ఇచ్చిన రేట్స్ ను మరి కొంత పెంచమని తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మతలు మరోసారి దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు.