• సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల
  • ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
  • సోషల్‌ మీడియాలో దేవర ట్రెండ్‌

PIL on Devara Ticket Prices in AP High Court: ప్రస్తుతం ఎవరిని కదిపినా.. ‘దేవర’ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో అయితే దేవర ట్రెండ్‌ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవర అదనపు షోలు, టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.

దేవర సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పిటిషనర్ పిల్ వేశారు. 10 రోజులకు మాత్రమే అనుమతి ఉండగా.. 14 రోజులకు ధరలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడంను సవాలు చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోల విషయంపై ఇటీవల దేవర టీమ్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా.. సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 28 నుంచి ఐదు ఆటలకు పర్మిషన్‌ ఇచ్చింది. అలానే సింగిల్‌ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్‌ క్లాస్‌కు రూ.110, లోవర్‌ క్లాస్‌కు రూ.60, మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.