భారతీయుడు-3 సినిమాని మరో 6 నెలల్లో విడుదల చేస్తామని దర్శకుడు శంకర్ తెలిపారు. పార్ట్-3లోనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందన్నారు. ‘భారతీయుడు మూవీకి సీక్వెల్ అవసరమా? అనే సందేహంలోనే ఏళ్లు గడిచిపోయాయి. కానీ అవినీతి ఇంకా అలానే ఉందని పత్రికలు, టీవీలు గుర్తుచేశాయి. అందుకే <>భారతీయుడు2 <>తీయాలనుకున్నా. ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ చిత్రాలకు సమయం వచ్చినప్పుడు పార్ట్2 తెరకెక్కిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.