విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న వీడీ 12 (VD 12) సినిమా టీమ్ నెక్ట్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham thinnanuri) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara entertainments) సంస్థ నిర్మిస్తోంది. వీడీ 12 టీమ్ గత నెల రోజులకు పైగా వైజాగ్ లో కీ షెడ్యూల్ జరుపుకుంది. ఇప్పుడు శ్రీలంక షెడ్యూల్ కు వెళ్లబోతున్నారు.

అక్కడ ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా సెలెక్ట్ చేయలేదు. శ్రీలీలతో (Sreeleela) ఈ సినిమా ఓపెనింగ్ చేసినా…ఇప్పుడామె ప్రాజెక్ట్ లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వీడీ 12 తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.