ఆ సినిమాలో, క్యారెక్టర్ లో ఏదో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటే తప్ప రశ్మిక మందన్న (Rashmika mandanna)ను కాస్ట్ చేయరు దర్శకులు. అందులో శేఖర్ కమ్ముల (Shekar kammula) లాంటి డైరెక్టర్ తీసే సినిమాలో హీరోయిన్ కు ఇంకా మంచి రోల్ ఉంటుంది. రశ్మికకు లక్కీగా అలాంటి రోల్ కుబేర (Kubera)లో దొరికినట్లు తెలుస్తోంది. ధనుష్ (Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేరలో రశ్మిక క్యారెక్టర్ అనేక ఇంట్రెస్టింగ్ లేయర్స్ తో ఆకట్టుకోనుందట.

ఈ నెల 5వ తేదీన రశ్మిక క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఈ రోజు వెల్లడించారు. నాగార్జున (Nagarjuna) ఈ సినిమాలో ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. రశ్మిక లుక్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రివీల్ చేసిన ఫొటోలో రశ్మిక ఓ పెద్ద లగేజ్ తో అడివిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ లగేజ్ లో డబ్బుందనే అనుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ట్యాక్స్ ఎగవేతలు, ఐటీ రైడ్స్ వంటి అంశాలతో తెరకెక్కుతున్న సినిమాగా టాక్ వినిపిస్తోంది.