Published on Nov 11, 2024 6:59 AM IST
యంగ్ హీరో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ‘12th ఫెయిల్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఐతే, అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా ఎపిసోడ్‌కు విక్రాంత్, మనోజ్ కుమార్‌లు హాజరై, ఈ సినిమా గురించి పలు ఇంగ్ట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.
మొదట విక్రాంత్ మాట్లాడుతూ.. తాను ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. మిమ్మల్ని (అమితాబ్ ని) తొలిసారి ఇదే మీట్ అవడం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘నాకు మాత్రం మనం ఇప్పటికే చాలా సార్లు కలుసుకున్నట్టు అనిపిస్తోంది. తెరపై మీ నటన చూసినప్పుడల్లా మీరు మా కుటుంబ సభ్యుడు అనిపిస్తుంది’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. అనంతరం ‘12th ఫెయిల్’ సినిమా గురించి విక్రాంత్ స్పందిస్తూ.. ‘ఈ మూవీ సంబంధిత బుక్‌ని చదువుతంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. వ్యక్తిగతంగా ఆ స్టోరీ నాకు కనెక్ట్ అయింది. అనుకున్నట్టే సినిమా విజయం సాధించింది’ అని అన్నారు.