నభా నటేష్ తన కెరీర్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్‌లో బలంగా స్థిరపర్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో నభా నటేష్‌కి భారీ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ‘డిస్కో రాజా’, ‘సోలో బతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మా స్ట్రో’, ‘డార్లింగ్’ వంటి సినిమాల్లో నటించినా, అనుకున్నంతగా ఆమెకు అవకాశాలు రాలేదు.
సినీ ప్రాజెక్ట్స్ పరంగా నభా నటేష్ కాస్త స్లోగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్ చేసి తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె ఫ్యాషన్ సెన్స్, స్టన్నింగ్ లుక్స్ అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా నభా నటేష్ వైట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సింపుల్‌గా, కానీ అద్భుతంగా కనిపిస్తున్న ఈ ఫోటోలు నభా గ్లామర్‌ను మరింత హైలైట్ చేశాయి. ఫోటోలకు పోజిచ్చిన విధానం ఆమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను మరింత హైలైట్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, ఫ్యాషన్ లవర్స్ నభా కొత్త లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రెండింగ్ ఫోటోలపై ఓ లుక్ వేయండి మరి!