రామ్(Ram pothineni) హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ (Double ismart) సినిమా రీసెంట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ కైనా తప్పకుండా మూవీని విడుదల చేయాలని టీమ్ షూటింగ్ స్పీడప్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ (Title song) రూపొందిస్తున్నారు. జానీ మాస్టర్ ఈ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ (Ismart shankar) లో టైటిల్ సాంగ్ పెద్ద హిట్. ఈ సీక్వెల్ సినిమాలోనూ అంతే ఇంపాక్ట్ ఉండేలా సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఛార్మీ ప్రొడ్యూసర్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri jagannath) డబుల్ ఇస్మార్ట్ మూవీని రూపొందిస్తున్నారు. రామ్ కు జోడిగా కావ్య థాపర్ (kavya thapar) నటిస్తోంది. సంజయ్ దత్ (Sanjay dutt) కీ రోల్ లో కనిపించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ ను పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.