మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవర తో ఘన విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించి, తారక్ అభిమానులను హర్షింపజేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. దేవర అనంతరం, ఆయన బాలీవుడ్ వార్ 2 లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా వార్ (2019) కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ షూటింగ్ ముంబైలో వేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడం చిత్రయూనిట్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ పై చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు నెట్టింట దర్శనమిచ్చాయి, దీంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా, లీకేజీ వ్యవహారం వారిని టెన్షన్‌కు గురి చేసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా, యాక్షన్ & ఛేజింగ్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయని సమాచారం. ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను ఉత్కంఠలో ఉంచుతోంది. ఇక లీకైన ఫోటోలపై తారక్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ దేవర 2 తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మాస్ యాక్షన్ మూవీ చేయనున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *