టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “లైలా” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తయి, ఈ రోమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధమైంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించగా, విశ్వక్ సేన్ ఈ చిత్రంలో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
సమీప కాలంలో విడుదలైన సినిమాల కంటే “లైలా” రన్‌టైమ్ కొద్దిగా తక్కువగా ఉంది. సెన్సార్ ప్రక్రియ పూర్తి కాగా, ఈ చిత్రానికి 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు) నిడివి ఉంది. ఈ కాంపాక్ట్ రన్‌టైమ్ యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే, ఈ సినిమాలో బోల్డ్ డైలాగ్‌లు, కొన్ని ఇంటెన్స్ సీన్లు ఉండటంతో సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే, ఈ మూవీని యువతకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దామని ప్రమోషన్లలో విశ్వక్ సేన్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రవి మారియా, హర్ష వర్ధన్, నాగి నీడు, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్, రఘుబాబు, వినీత్ కుమార్, అభిమాన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, విశ్వక్ సేన్ ఇటీవల మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంకి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. సినిమా విడుదల సమీపిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.