
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్ హిట్ సినిమాలు వరుసగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, ఫ్యామిలీ డ్రామాలు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాయి. అలాంటి టాప్ ట్రెండింగ్ మూవీ గురించి నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆ సినిమా మిసెస్ (Mrs). ఈ హిందీ సినిమా, మలయాళ సూపర్ హిట్ మూవీ “ది గ్రేట్ ఇండియన్ కిచెన్” యొక్క అధికారిక రీమేక్. అసలు సినిమాగా ఈ చిత్రం జీవిత సత్యాలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. మలయాళ వెర్షన్ ఎంతలా ప్రేక్షకులను మెప్పించిందో, అదే స్థాయిలో హిందీ రీమేక్ కూడా ఓటీటీలో ప్రభంజనం సృష్టిస్తోంది.
ప్రముఖ ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించింది. ‘దంగల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాన్యా, ఈ చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనబరిచింది. నిషాంత్ దహియా, కన్వల్జీత్ సింగ్ కూడా ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ZEE5 తమ సోషల్ మీడియా ద్వారా “మిసెస్ – బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎవర్ను నమోదు చేసింది” అని వెల్లడించింది. అంతేకాదు, గూగుల్‌లో నెటిజన్లు ఈ సినిమాను ఎక్కువగా సెర్చ్ చేసిన మూవీగా పేర్కొంది.