Alia Bhatt Joins Prabhas’s New Film
Alia Bhatt Joins Prabhas’s New Film

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్ మరియు కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం, రాజాసాబ్, సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ప్రభాస్, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

హనురాఘపూడి దర్శకుడిగా తన అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై, పడి పడి లేచె మనసు వంటి సినిమాలతో విజయాలను అందుకున్నాడు. సీతారామం సినిమా కూడా అతని పేరు మళ్లీ మరింత ప్రముఖంగా చేసింది. ఇప్పుడు, ప్రభాస్ తో సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హనురాఘపూడి, ఈ ప్రాజెక్టుకు పౌజి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీ నటించనున్నారు. మొదట్లో ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఇమాన్వీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి, ఒక పెద్ద స్టార్‌గా మారిపోయింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన మరొక సంచలన వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ కూడా ఈ సినిమాలో మహారాణి పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది, మరియు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *