SK 23 Official Title Madarasi Released
SK 23 Official Title Madarasi Released

తాజాగా ‘అమరన్’ మూవీతో భారీ హిట్ అందుకున్న తమిళ హీరో శివకార్తికేయన్, మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సుప్రసిద్ధ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న ‘ఎస్‌కే 23’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అధికారికంగా ‘మదరాసి’ అనే టైటిల్‌ను పొందింది. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.

SK 23 Official Title Madarasi Released

ఈ గ్లింప్స్‌లో శివకార్తికేయన్ పూర్తిగా కొత్త లుక్‌లో, ఇంతకుముందెప్పుడూ చూడని భీకరమైన మాస్ అవతార్‌లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ టీజర్‌తో సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్లారు మేకర్స్.

‘మదరాసి’ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యాక్షన్ స్టార్స్ విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ, శివకార్తికేయన్ కెరీర్‌లో మరో భారీ మాస్ ఎంటర్టైనర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *