
సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మరికొన్ని అందమైన ఫొటోలు షేర్ చేసింది. ఎప్పుడూ తన స్టైలిష్ లుక్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే సుప్రిత, ఈసారి రోజా పూలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.
సుప్రిత షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్గా మారడంతో, నెటిజన్లు ‘రోజా పూలతో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫోటోలపై ఎప్పుడూ పాజిటివ్ రిస్పాన్స్ వస్తూనే ఉంటుంది, అయితే కొన్ని సందర్భాల్లో నెగటివ్ కామెంట్స్ కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ, సుప్రిత తనదైన స్టైల్లో ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం సుప్రిత హీరోయిన్గా తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఓ సినిమా ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసిన ఆమె, ఇందులో బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. సినీ ప్రియులు, ఆమె అభిమానులు సుప్రిత తొలి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.