Pavani Reddy Second Marriage Details
Pavani Reddy Second Marriage Details

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పావని రెడ్డి త్వరలో రెండో వివాహం చేసుకోబోతోంది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పావని, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టి చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఆమె పెళ్లి ఈ నెల 20న జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

2013లో పావని తొలి వివాహం తెలుగు నటుడు ప్రదీప్ కుమార్‌తో జరిగింది. అయితే, 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పట్లో పావని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే కారణమనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ విషయంపై ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. ఎంతో కాలం తర్వాత, ఆమె తమిళ బిగ్‌బాస్ సీజన్-5 ద్వారా తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

ఈ రియాలిటీ షోలో పావని, కొరియోగ్రాఫర్ ఆమిర్ ప్రేమలో పడినట్లు సమాచారం. బిగ్‌బాస్ తర్వాత వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు పెళ్లితో వారిద్దరి బంధం కొత్త జీవితానికి అడుగుపెట్టనుంది. అభిమానులు పావనికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *