నభా నటేష్ మరోసారి హీరోయిన్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ అందాల భామ, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్న నభా, ఆ సినిమా తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయాయి.
అయితే నభా నటేష్‌కు జరిగిన ప్రమాదం, ఆమె సినీ కెరీర్‌కు బ్రేక్ వేసింది. గాయాల కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన నభా, ఇప్పుడు తిరిగి ఫిట్‌గా మారి, సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల డార్లింగ్ సినిమాలో నటించినా, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో హాట్ టాపిక్‌గా మారుతోంది.
తాజాగా నభా తన యాక్సిడెంట్ అనుభవం, ఫిట్‌నెస్ జర్నీ గురించి అభిమానులతో పంచుకుంది. యాక్సిడెంట్ తర్వాత వర్కౌట్స్ చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని చెప్పిన నభా, “అప్పట్లో హీరోయిన్లకు ఉండాల్సిన ఫిట్‌నెస్ కోసం కాస్త వర్కౌట్స్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచన మారిపోయింది. శరీరంపై మరింత అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ఎక్కువగా చేస్తున్నా” అని తెలిపింది.
ఈ బ్యూటీ త్వరలోనే మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తోంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తోంది. మరి, ఈ గ్లామరస్ బ్యూటీ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందా? చూడాలి.