
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. రజనీకాంత్ సరసన మంజు వారియర్ కథానాయికగా నటించగా, ఈ క్రైమ్ యాక్షన్ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ మాస్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సన్నివేశాలు, కథ కథనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Pooja Hegde to Dance in Rajini Coolie
ఈ విజయం తర్వాత రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌవిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండో దశ షూటింగ్ జరుపుకుంటుండగా, తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది.
ఈ సినిమా స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. గతంలో రంగస్థలం సినిమాలో “జిగెలు రాణి” పాటకు స్టెప్పులేసిన పూజా, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. గత కొంతకాలంగా పూజాకు వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ ఆమెకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.