
ప్రేమికుల దినోత్సవం ముగిసిన కొన్ని రోజుల తర్వాత, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె షేర్ చేసిన గులాబీల బొకే ఫోటో, ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
“నీకు నా ముఖంలో చిరునవ్వును ఎలా తెప్పించాలో బాగా తెలుసు పాపలు!” అంటూ క్యాప్షన్ ఇచ్చిన రష్మిక, “ఒక స్పెషల్ పర్సన్” ఈ బొకే పంపించాడని పేర్కొన్నారు. అంతేకాదు, రెడ్ హార్ట్ ఎమోజీ కూడా యాడ్ చేయడం వల్ల ఆమె పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ గులాబీల పుష్పగుచ్ఛం ఎవరిచ్చారు? అనేది మాత్రం రివీల్ చేయలేదు.
అయితే, రష్మిక పోస్ట్ చూసిన ఫ్యాన్స్ & నెటిజన్లు మాత్రం “ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ పంపిన సర్ప్రైజ్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే రష్మిక తన పర్సనల్ లైఫ్ గురించి కాస్త మిస్టరీ ఉంచుతూ ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇవ్వడమే కారణమంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఈ లవ్ హింట్స్ నిజంగా విజయ్ దేవరకొండ కోసమా? లేక ఇంకెవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారా? అన్నదానికి సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!