
యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, హీరోగా సూపర్ హిట్ సినిమాలు అందుకున్న తమిళ్ స్టార్ శివకార్తికేయన్. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ లాంటి విజయవంతమైన సినిమాలతో గుర్తింపు పొందిన శివకార్తికేయన్, తెలుగు ప్రేక్షకులకు “ప్రిన్స్” సినిమాతో మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన “అమరన్” సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో “మదరాసి” అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్, శివకార్తికేయన్ కు మరో బిగ్గెస్ట్ హిట్ ను అందించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే “మదరాసి” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, ఆయన డిఫరెంట్ లుక్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే, “అమరన్” సినిమా కోసం శివకార్తికేయన్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘అమరన్’ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ కాలేజీ స్టూడెంట్ గా, ఆర్మీ ఆఫీసర్ గా వేరియేషన్స్ చూపించాల్సి వచ్చింది. దీంతో, ఆయన బాడీ బిల్డ్ చేయడం కోసం కఠినమైన వర్కౌట్స్, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ముందుగా బరువు తగ్గాను, ఆ తర్వాత సరిగ్గా టోన్డ్ బాడీ బిల్డ్ చేసుకున్నాను” అని తెలిపారు.
ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, మురగదాస్ మార్క్ యాక్షన్, థ్రిల్ తో “మదరాసి” ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతుండడం విశేషం.