
టాలీవుడ్‌లో అడవి నేపథ్య చిత్రాలు భారీగా పెరుగుతున్నాయి. పుష్ప-1 లో శేషాచలం అడవుల గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేసేందుకు రెడీ!
ఇందులో ప్రధాన హైలైట్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా. కెన్యా అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోంది. మహేష్‌ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించడానికి జక్కన్న గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో మరో ఫారెస్ట్ థీమ్ మూవీ రాబోతోంది. ఇందులో శర్వా తెలంగాణ యాసలో మాట్లాడతాడని టాక్.
మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ఓ అడవి హారర్ థ్రిల్లర్ లో నటిస్తుండగా, అనుష్క శెట్టి ఘాటీ పూర్తిగా జంగుల్ బ్యాక్‌డ్రాప్ లోనే సాగనుంది. ఈ మూవీ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలోనూ అడవి నేపథ్య సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం.
టాలీవుడ్‌లో అడవి నేపథ్య చిత్రాల జోరు చూస్తుంటే, ఈ ట్రెండ్ మళ్లీ నిలబోనుంది.