
పాయల్ రాజ్ పుత్ 1992 డిసెంబర్ 5న న్యూఢిల్లీ లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్. చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి కలిగిన ఈ భామ, యాక్టింగ్ డిప్లొమా పూర్తిచేసి, ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తూ, టెలివిజన్ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
2010లో, హిందీ సీరియల్ “సప్నోన్ సే భరే నైనా” ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. ఆపై “ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై” అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించింది. “గుస్తాఖ్ దిల్”, “మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ” వంటి పాపులర్ టీవీ షోలలోనూ నటించింది.
సినిమా రంగంలోకి అడుగుపెట్టి, 2017లో పంజాబీ సినిమా “చన్నా మేరేయా” ద్వారా వెండితెరపై పరిచయమైంది. 2018లో హిందీ చిత్రం “వీరే కి వెడ్డింగ్” లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే, తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు బిగ్ బ్రేక్ వచ్చిన చిత్రం “RX 100” (2018). యంగ్ హీరో కార్తికేయ సరసన నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తర్వాత “వెంకీ మామ” (2019) లో వెంకటేష్ సరసన, 2023లో “మంగళవారం” చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం “వెంకటలచ్చిమి” అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. తన యాక్టింగ్, గ్లామర్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.