
2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ అప్పట్లో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికీ యూత్‌లో క్రేజ్ కొనసాగిస్తోంది. ఇందులో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ కీలకపాత్రల్లో నటించగా, కమలాకర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు తమ జీవిత కథలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. కొందరి కథలు నవ్విస్తే, మరికొందివి ఎమోషనల్ గా, ఇంకొందివి షాకింగ్ గా ఉంటాయి.
ఈ సినిమా బోల్డ్ కాన్సెప్ట్, నేచురల్ నరేషన్ తో ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేసింది. ముఖ్యంగా హీరోయిన్ అమృత తన పాత్రలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి యువతను ఆకట్టుకుంది. ఆమె నటన, కొన్ని సీన్స్ కోసం ఇప్పటికీ సినిమాను మళ్లీ మళ్లీ చూసే అభిమానులు ఉన్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ఆమె మరే ఇతర తెలుగు చిత్రంలో కనిపించలేదు.
సాధారణంగా పాత హిట్ సినిమాలు రీ-రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా, ‘ఆరుగురు పతివ్రతలు’ను మళ్లీ థియేటర్లలో చూడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినా, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి విజయం సాధించింది. ఈవీవీ మార్క్ కామెడీ, ఆసక్తికరమైన కథనం ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఇప్పటి యంగ్ జనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో, ఈ మూవీ రీ-రిలీజ్ అయితే పెద్ద హిట్ అవ్వొచ్చు!