
టెలివిజన్ ప్రపంచంలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ అందాల సోయగంతో పాటు ఎనర్జిటిక్ యాంకరింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ, ఇప్పుడు మరిన్ని టీవీ షోలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. యాంకరింగ్ మాత్రమే కాకుండా, సినీ కెరీర్‌ను కూడా కొనసాగిస్తూ, పలు సినిమాల్లో నటించింది.
రష్మీ కెరీర్ ప్రారంభ దశలో చిన్న పాత్రలతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత టీవీ షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసి కుర్రాళ్లను కట్టిపడేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది.
అయితే, రష్మీ ఒకప్పటి యువ సీరియల్లో కూడా నటించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ సీరియల్ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా, యువ సీరియల్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సీరియల్‌కు గెస్ట్‌గా విచ్చేసిన వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తూ, “రష్మీ అప్పట్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ ట్విట్టర్ (X) ద్వారా అక్కినేని నాగార్జున ను ట్యాగ్ చేస్తూ, యువ సీరియల్ రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. “Good old memories from Yuva serial days! Wish they do a reunion episode @iamnagarjuna sir plsss” అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవ్వగా, నాగార్జున దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.