
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన అందాల తార వేదిక చిన్ననాటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఆమెను గుర్తు పట్టి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు.
ఫిబ్రవరి 21న వేదిక తన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా, అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. సుమారు 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వేదిక స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. అయినప్పటికీ, మంచి సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
ఇటీవల వేదిక తన లుక్స్‌లో భారీ మార్పు తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో సింపుల్ గా కనిపించిన ఈ భామ ఇప్పుడు గ్లామరస్ హాట్ ఫొటోషూట్స్‌తో నెట్టింట హీట్ పెంచేస్తోంది.
తెలుగులో వేదిక చివరగా ఫియర్ అనే సినిమాలో నటించింది. 2024 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతకు ముందు రజాకార్ సినిమాలోనూ నటించగా, మంచు లక్ష్మి యక్షిణి వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం వేదిక తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వేదిక, త్వరలోనే టాలీవుడ్లో మళ్లీ గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.