
సలార్, కల్కి 2898 AD వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ స్పీడ్‌లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ భారీ విజయం సాధించగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందిన కల్కి 2898 AD రూ. 1000 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది.
ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ థ్రిల్లర్‌లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది, ఈ సినిమాను ఏప్రిల్ 2025లో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ అనే చిత్రంలో నటించనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ కొడుకు స్పిరిట్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఏడీగా పని చేసిన త్రివిక్రమ్ కొడుకు, ఇప్పుడు ప్రభాస్ చిత్రంలో కూడా పనిచేస్తున్నాడని టాక్.
రాజా సాబ్ విడుదల దగ్గర పడగా, స్పిరిట్ మూవీ కూడా త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. వరుస సినిమాలతో ప్రభాస్ అభిమానులకు పండగే.