
ప్రియాంక చోప్రా సినిమా ప్రయాణం నిజంగా ప్రేరణగా చెప్పుకోవాలి. బాలీవుడ్‌లో సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్లో సినిమాలు చేస్తూ, టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం, అభినయం, టాలెంట్‌తో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంది.
ఇటీవల ప్రియాంక చోప్రా చిన్ననాటి ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందులో ఆమె మోటార్‌సైకిల్ పై కూర్చొని, పెద్ద గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తోంది. ప్రస్తుత హాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా వెలుగొందుతున్న ప్రియాంక ఇదేనా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోపై అభిమానులు “క్యూట్” అంటూ కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే, ఆమె త్వరలోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఆమె సుమారుగా ₹700 కోట్ల నెట్ వర్త్ కలిగిన టాప్ ఇండియన్ యాక్ట్రెస్‌గా కొనసాగుతోంది. సినీ కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ వరుసగా గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తోంది. ప్రియాంక హాలీవుడ్లోనే కాదు, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా తన మార్క్ వేసేందుకు సిద్ధంగా ఉందా? వేచిచూడాలి!