
కంగనా రనౌత్ తాజా సినిమా ఎమర్జెన్సీ ఎన్నో వివాదాల తరువాత చివరకు జనవరి 17, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇండియా చరిత్రలో జరిగిన ఎమర్జెన్సీ కాలాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. కంగనా నటనను, ముఖ్యంగా ఆమె ఇందిరా గాంధీ పాత్రలో చూపిన అభినయాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నప్పటికీ, సినిమా కొంతమంది ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ₹60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కేవలం ₹21 కోట్లు మాత్రమే రాబట్టింది.
థియేటర్లలో అంతగా విజయం సాధించని ఎమర్జెన్సీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 17, 2025 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్కి రానున్నట్లు కంగనా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చాలా సినిమాలు వివిధ భాషల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో, ఎమర్జెన్సీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాలో కంగనా తో పాటు అనుపమ్ ఖేర్ (జయప్రకాశ్ నారాయణ), శ్రేయాస్ తల్పడే (అటల్ బిహారీ వాజ్‌పేయీ) ముఖ్య పాత్రలు పోషించారు. మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారు. దర్శకురాలిగా, నిర్మాతగా కంగనా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతున్న ఈ సినిమా మరింత ప్రేక్షకాదరణ పొందుతుందా? మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఎమర్జెన్సీ సినిమాను చూడాలనుకుంటున్నారా?