Telugu Cinema 2025 Big Releases List
Telugu Cinema 2025 Big Releases List

ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద పోటీ జరగబోతోంది. రాయలసీమ యాస సినిమాలకు మంచి గుర్తింపు రావడంతో, సాయి తేజ్ తన ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో అదే యాసను ఎంచుకున్నారు. ఈ చిత్రం బాలకృష్ణ ‘అఖండ 2’ తో గట్టి పోటీకి సిద్ధమవుతోంది.

ఇక, రామ్‌ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC 16’ మూవీ అక్టోబర్‌ 16న విడుదల కానుంది. ఇది గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌కి ఒక ప్రత్యేకమైన సినిమా కానుంది. మరి ‘రాజా సాబ్’ గా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అక్టోబర్‌ 23న థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

అంతే కాకుండా, కాంతార ప్రీక్వెల్ కూడా అక్టోబర్‌లోనే విడుదలయ్యే అవకాశముంది. ప్రాచీన కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రం కాంతార ఫస్ట్ చాప్టర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. మరోవైపు, OG, Toxic, విశ్వంభర వంటి భారీ ప్రాజెక్ట్స్‌ కూడా ఈ షెడ్యూల్‌లో విడుదల కానున్నాయన్న టాక్‌ ఉంది.

సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ మూవీ వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు OG, Toxic వంటి సినిమాలు కూడా ఈ క్యూ లో ఉండే అవకాశముంది. మొత్తం మీద, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టాలీవుడ్‌లో భారీ సినిమా వర్షం కురిసేలా కనిపిస్తోంది!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *