Published on Nov 14, 2024 8:15 AM IST
‘విశాఖ ఉక్కు – తెలుగు వారి హక్కు’ నినాదంతో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం “ఉక్కు సత్యాగ్రహం”. గద్దర్ మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ సినిమాను ఈ నెల 29న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు.. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను నిర్మించాను. ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లేట్ అవ్వడం.. మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ చిత్రంలో నాలుగు పాటలు రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.