
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన కెరీర్‌ను ఎంతో స్ట్రాటజీక్‌గా ప్లాన్ చేస్తోంది. వరుసగా హిట్ సినిమాలు అందుకున్నా, పారితోషికాన్ని విపరీతంగా పెంచకుండా, ఎక్కడైతే తన కెరీర్‌కి ఉపయోగపడుతుందనుకుంటుందో అక్కడ మాత్రమే ఎక్కువ డిమాండ్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు ఆమె సాధారణ రెమ్యూనరేషన్‌ను మాత్రమే తీసుకుంటుండగా, ప్రత్యేకంగా తనకు ప్రాధాన్యత ఉండే ప్రాజెక్టుల కోసం మాత్రం బిగ్ అమౌంట్ కోరుతోందన్నది ఇండస్ట్రీ టాక్.
ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్లో అడుగుపెడుతోంది. అయితే అక్కడ కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తుందా? లేక టాలీవుడ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటుందా? అన్నదే ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇప్పటికే హిందీలో ఆమె కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఆషికి 3 వంటి ప్రాజెక్ట్‌లలో నటించనుంది. ఈ సినిమాలు విజయం సాధిస్తే, ఆమె కెరీర్ మరింత స్థిరపడనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్లో కూడా బిజీగా ఉంది. రవితేజతో మాస్ జాతర, నితిన్‌తో రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తమిళంలో పరాశక్తి అనే సినిమాలో నటించనుంది.
ఈ సినిమాలు హిట్ అయితే శ్రీలీల కెరీర్ మరింత పీక్‌కి వెళ్లడం ఖాయం. ఆమె బాలీవుడ్లో కూడా విజయవంతమవుతుందా? లేదా టాలీవుడ్‌కే పరిమితమవుతుందా? అనేది చూడాలి.