
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో తన ప్రత్యేక గ్లామర్ సాంగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్‌కు ఏకంగా రూ.3 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు పెద్ద హిట్ లేకపోయినప్పటికీ, స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది.
ఉర్వశి రౌతేలా 2013లో సన్నీ డియోల్ సరసన సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించింది. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చిత్రాలు కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి. కానీ ఆమె గ్లామర్, స్టైలిష్ లుక్ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో స్పెషల్ సాంగ్స్ కోసం హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 73 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఊర్వశి సోషల్ మీడియాలో కూడా సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమెకు ఉన్న బ్రాండ్ విలువ దృష్ట్యా నిర్మాతలు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ కోసం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఊర్వశి ముందువరుసలో ఉంది.
ఆమె కెరీర్ ఇంకా బ్రేక్ తీయలేదా? లేదంటే ఈ గ్లామర్ క్రేజ్‌తోనే కొనసాగుతుందా? అనేది చూడాల్సిందే. టాలీవుడ్‌లో ఊర్వశి మరిన్ని ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.