
తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డార్క్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ ఘన విజయం సాధించింది. జీవా, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం టైమ్ ట్రావెల్, హారర్, సస్పెన్స్ అంశాలతో థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. కేజీ సుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది హీరో జీవా కెరీర్ లోనే అతిపెద్ద విజయం.
థియేటర్లలో సంచలనం సృష్టించిన డార్క్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో చూసే అవకాశం మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ మైండ్-బెండింగ్ థ్రిల్లర్ ని ఆస్వాదించవచ్చు. ఈ కథలో వసంత్ (జీవా) – అరణ్య (ప్రియా భవానీ శంకర్) అనే దంపతులు హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు సముద్ర తీరంలోని తమ కొత్త విల్లాకు వెళతారు. అయితే ఎదురుగా ఉన్న మరో విల్లాలో తమ పోలికలతోనే ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోతారు.
ఒకానొక సమయంలో అరణ్య అనూహ్యంగా మాయమవుతుంది. అసలు ఆమెకు ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే క్రమంలో వసంత్ అద్భుతమైన, రహస్యంతో నిండిన సంఘటనలను ఎదుర్కొంటాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్, భయానక హారర్ అంశాలతో సినిమా ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠగా ఉంచుతుంది.
ఇది సాధారణ సైన్స్ ఫిక్షన్ సినిమా కాకుండా, కొత్త కోణంలో కథను చూపించే థ్రిల్లర్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి!