
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న షాలిని పాండే ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అర్జున్ రెడ్డి మూవీలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే, ఆ తర్వాత ఆమె కెరీర్ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినప్పటికీ, అక్కడ కూడా ఆమె ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ప్రస్తుతం షాలిని వెబ్ సిరీస్‌లు, చిన్న సినిమాల్లో నటిస్తూ తన ప్రెజెన్స్‌ను కొనసాగిస్తోంది. అయితే, సినిమాల్లో కనపడకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆమె పింక్ డ్రెస్‌లో మెరిసిపోతూ స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. గ్లామర్ టచ్ ఉన్న ఈ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ లుక్స్, బోల్డ్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. షాలిని కెరీర్ దూసుకెళ్లకపోయినా, ఆమె అందం, ఆకర్షణSocial Mediaలో ఆమె క్రేజ్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ భామ, త్వరలో మరో హిట్ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తుందా? వేచిచూడాలి.