Tanya Ravichandran Stuns in Modern Look
Tanya Ravichandran Stuns in Modern Look

తాన్యా రవిచంద్రన్ ఇటీవల తన గ్లామర్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హోమ్లీ క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న తాన్యా.. ఇప్పుడు స్టైలిష్ అవతార్ లో ఫోటోషూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె తాజా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆమె కిల్లింగ్ లుక్స్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

తాన్యా రవిచంద్రన్ ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు. ఆమె 2017లో “పాలే విల్లయతేవా” చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కరుప్పన్ (Karuppan), బృందావనం (Brindavanam), మాయోన్ (Maayon) వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆమె మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్‌ఫాదర్” చిత్రంలో నయనతార చెల్లిగా కనిపించింది. అయినప్పటికీ, హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాలేదు.

ఇప్పుడేమో తాన్యా తన గ్లామరస్ లుక్ తో ఆకర్షణగా మారింది. సినిమాల్లో ఎక్కువగా సాంప్రదాయిక పాత్రలు పోషించిన ఆమె తాజాగా బోల్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Instagram, Twitter, Facebook వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆమె కొత్త ఫోటోషూట్ వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె స్టైలిష్ అవతార్ ను తెగ ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం తాన్యా సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. ఈ గ్లామర్ లుక్ ఆమె కెరీర్‌కు కొత్త దారులు తీసుకువస్తుందా? త్వరలోనే ఆమె పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కనిపించే ఛాన్స్ ఉందా? చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *