
“దేవర” సినిమాలో తంగం పాత్ర చిన్నదైనా, జాన్వీ కపూర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఆమె టాలీవుడ్లో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటోంది. ఇప్పుడు “దేవర పార్ట్ 2” కోసం ఫ్యాన్స్ భారీగా వెయిట్ చేస్తున్నారు.
దేవర విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే, “RC16” మూవీ షూటింగ్లో బిజీ అయిపోయారు జాన్వీ. ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు సానా గెలుపు గ్యారంటీ అని కాన్ఫిడెంట్‌గా చెప్పిన తీరు, ప్రేక్షకుల్లో జాన్వీకి సెకండ్ హిట్ ఫిక్స్ అనే భావనను తీసుకొచ్చింది.
కొన్ని రోజుల కిందట నాని – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌లో జాన్వీ నటించనుందనే వార్తలు వచ్చాయి, కానీ అవి నిజం కాదని స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికి ఆమె తెలుగులో “RC16” మరియు “అల్లు అర్జున్ – అట్లీ” సినిమాల్లో మాత్రమే కమిట్ అయ్యారు.
“RC16” షూటింగ్ పూర్తయిన వెంటనే, జాన్వీ అల్లు అర్జున్ సినిమా సెట్స్‌లో అడుగు పెడతారు. అట్లీ డైరెక్షన్లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో, జాన్వీ కథానాయికగా కన్ఫర్మ్ అయ్యారనే న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ భామలు సౌత్‌లో అలా వచ్చి, ఇలా వెళ్లిపోతుంటే, జాన్వీ మాత్రం ఇక్కడే సెటిల్ కావాలని ఫిక్స్ అయ్యారని శ్రీదేవి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు. బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్‌లు దక్కించుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు జాన్వీ సిద్ధంగా ఉన్నారు.