Kingdom Teaser Review And Expectations
Kingdom Teaser Review And Expectations

“కమాన్ బోయ్స్.. గెట్ రెడీ!” అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉత్సాహపరిచాడు. కింగ్‌డమ్‌ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రౌడీ ఫ్యాన్స్ జోష్ పెంచేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు పెంచింది.

“ఫ్యామిలీ స్టార్” చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో, విజయ్ ఫ్యాన్స్ తదుపరి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, “కింగ్‌డమ్” టీజర్ మాత్రం హిట్ గ్యారంటీని ఇచ్చేసింది. దీని ద్వారా కథలో డెప్త్ ఉందని, విజయ్ మళ్లీ మాస్ అపీల్లో రానున్నాడని స్పష్టమైంది. ఈ సినిమా మే 30న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

రౌడీ హీరో “కింగ్‌డమ్” తో మరో బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కింగ్‌డమ్ సమ్మర్ స్పెషల్ హిట్ గా నిలుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న! మే 30 కోసం సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *