Kannappa Movie Multilingual Release Update
Kannappa Movie Multilingual Release Update

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” కోసం బిజీగా ఉన్నాడు. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గకుండా చిత్ర బృందం తాజా అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది.

ఇటీవల “శివ శివ శంకరా” పాట విడుదలైంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సినిమా మీద ఉన్న నెగెటివ్ టాక్ తగ్గిపోవడంతో, ఈ పాట సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు తన వ్యక్తిగత జీవితంపై స్పందించాడు.

“శివుడు నాకు వరం ఇస్తానంటే… ఎన్ని జన్మలెత్తినా మోహన్ బాబునే తండ్రిగా కోరుకుంటాను. నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. మా కుటుంబ గొడవలు త్వరగా ముగియాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

“కన్నప్ప” సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, యోగి బాబు, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు.

మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “కన్నప్ప” మూవీ ఏప్రిల్ 25, 2025 న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కి అద్భుతమైన హైప్ ఉండటంతో, ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *