
హీరోగా, దర్శకుడిగా, సింగర్‌గా పలు ప్రతిభలు కనబరిచిన ధనుష్, మరోసారి తన డాన్స్ టాలెంట్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. తాజాగా, ఆయన దర్శకత్వం వహించిన “జాబిలమ్మా నీకు అంత కోపమా” (తమిళంలో “Nilavuku Enmel Ennadi Kobam”) సినిమాలో షూటింగ్ రిహార్సల్ వీడియో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 22, 2025 న విడుదలైన ఈ వీడియోలో ధనుష్, శరణ్య పొన్వన్నన్ కలిసి డాన్స్ రిహార్సల్ చేస్తున్నారు. ఇది అసలు సీన్ లో భవిష్, శరణ్య కలిసి చేయాల్సిన సీన్, కానీ ధనుష్ డాన్స్ చూసిన ఫ్యాన్స్ “ధనుష్ డాన్స్ భవిష్ కంటే బెస్ట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని ఫ్యాన్స్ అయితే “ఇది చూస్తే రఘువరన్ B.Tech మూవీ మజా వస్తుంది” అని అంటున్నారు.
ఈ సినిమాలో భవిష్ హీరోగా, అనికా సురేంద్రన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే శరత్‌కుమార్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అయితే, కొందరు ప్రేక్షకులు ఈ సినిమా “ప్రేమలు” మూవీ ఫీల్ ఇస్తోందని అంటున్నారు.
ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మూడో సినిమా అయిన జాబిలమ్మ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.