
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తోంది. ఇటీవలే మహా కుంభమేళా సందర్శించిన ఈ బ్యూటీ, ఇప్పుడు కాశీ యాత్ర చేస్తూ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాశీ గంగా తీరంలో పడవ ప్రయాణం చేస్తూ, ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్ లో కనిపించిన దీప్తి, తన సింపుల్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. నవ్వుతూ ఫోజులిస్తూ, గంగా తీరం అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.
ఇంతేకాదు, ఇటీవల దీప్తి తన చేతిపై శివుడి టాటూ వేయించుకుంది. ఈ టాటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “శివయ్యతో నేను” అని క్యాప్షన్ ఇచ్చింది. దీప్తికి టాటూల పట్ల ఆసక్తి కొత్త కాదు, కానీ ఈసారి మోడ్రన్ టచ్ కాకుండా, భక్తిభావం కలిగిన టాటూ వేయించుకోవడం విశేషం.
కాశీ యాత్ర ఫోటోలు, శివ టాటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీప్తి ఈ ఆధ్యాత్మిక మార్పు ఎందుకు చేసుకుంది? ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణమేనా లేదా ఇంకా ఏదైనా ప్రత్యేక కారణముందా? అనేది ఆసక్తికరంగా మారింది.