
తెలుగు సినీ ప్రియులకు నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ‘జెంటిల్మెన్’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తన అభినయంతో అందరి మనసులను గెలుచుకుంది. ‘నిన్ను కోరి’, ‘వకీల్ సాబ్’ వంటి హిట్ సినిమాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అయితే, గత కొంతకాలంగా నివేదా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఆమె కొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సన్నగా కనిపించే ఈ నటి ఇప్పుడు బొద్దుగా మారిపోయింది, ఇది చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన నివేదా, ఈ క్యారెక్టర్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు ప్రశంసించారు.
ప్రస్తుతం ఎల్లో డ్రెస్‌లో మతిపోగొట్టే అందంతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు ఆమె పెళ్లికి సిద్ధమవుతోందా? లేదా కొత్త సినిమా కోసం ఇలా మారిందా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. తప్పకుండా నివేదా థామస్ త్వరలో మరొక సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.