
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సార్, లక్కీ భాస్కర్ హిట్స్ తర్వాత, ఇప్పుడు ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేయనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ చిత్రం ఇంజినీరింగ్ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందని, 80s కాలానికి సంబంధించిన స్టోరీ అని సమాచారం. ఇప్పటివరకు వెంకీ ఎడ్యుకేషన్, ఆర్థిక నేరాలపై సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మూడో హిట్ కోసం సిద్ధమవుతున్నారు.
కానీ, వెంకీ అట్లూరి తెలుగులో సినిమాలు చేయడం లేదు ఎందుకు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట రంగ్ దే లాంటి సినిమా చేశాక, ఆయన టాలీవుడ్ హీరోలతో మళ్లీ సినిమా చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. తెలుగు హీరోలు ఆయన కథలను అంగీకరించడం లేదు? లేక తమిళ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అనే చర్చ నడుస్తోంది.
ఏదేమైనా, వెంకీ బాక్సాఫీస్ విజయం అందుకుంటూనే తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సూర్య సినిమా అధికారికంగా అనౌన్స్ అయితే, అది మరో పాన్ ఇండియా హిట్ అవ్వొచ్చు. తెలుగు హీరోలతో వెంకీ అట్లూరి మళ్లీ సినిమా చేస్తాడా? లేక తమిళ ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తాడా? వేచి చూడాలి.