ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేశ్, దర్శకుడు సుకుమార్ లాంటి ప్రముఖులు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్‌ను ఆస్వాదించారు. చిరంజీవి భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్‌లతో కలిసి మ్యాచ్ వీక్షించడం అభిమానులను ఉత్సాహపరిచింది.
బాలీవుడ్ నుంచి సోనమ్ కపూర్ స్టేడియంలో సందడి చేయగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, నటుడు సన్నీ డియోల్ కలిసి మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
మ్యాచ్ విషయానికొస్తే, పాకిస్తాన్ 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. మరోవైపు, భారత జట్టు బంగ్లాదేశ్‌పై తొలి విజయంతో మంచి ఊపు మీద ఉంది. ఈరోజు గెలిస్తే సెమీఫైనల్‌కు ప్రవేశించే అవకాశం ఉంది.
ధోని & సన్నీ డియోల్ ఫోటో, చిరంజీవి స్టేడియం లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంటుందా? వేచి చూడాలి.