
సౌత్ హీరోయిన్ భవ్య త్రిఖా మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు పెద్దగా తెలియకపోయినా, తమిళ ‘జో’ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. రియో రాజ్, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంచనాలు లేకుండా రిలీజై, పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో భవ్య త్రిఖాకు సౌత్ ఇండస్ట్రీలో బలమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే, తొలి సినిమాతో స్టార్‌డమ్ తెచ్చుకున్నా, ఆమెకు ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ, భవ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్, తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా మహా కుంభమేళా సందర్బంగా షేర్ చేసిన ఫోటోలు సమాజ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం చూసిన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం భవ్య తమిళ, మలయాళ పరిశ్రమల్లో కొన్ని సినిమాలు చేస్తోంది. ఆమె టాలెంట్, అందం చూసి త్వరలోనే తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. గ్లామర్, అభినయం, సోషల్ మీడియా క్రేజ్ కలిగిన భవ్య త్రిఖా, త్వరలోనే ఇండస్ట్రీలో మరో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఆశిద్దాం