
తాజాగా మోనాలిసా అనే యువతి సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆమె కుంభమేళాకు వెళ్ళినప్పుడు ఎవరో ఆమె ఫోటోను పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే అది వైరల్‌గా మారి ఆమెను సెలబ్రిటీగా మార్చేసింది. ఆమె తేనె కళ్లతో కూడిన అందం, చిరునవ్వు నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో కుంభమేళాకు వచ్చిన ప్రజలు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
ఈ అనూహ్యమైన పాపులారిటీతో మోనాలిసాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) ఆమెను తన కొత్త సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ (The Diary of Manipur) లో ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అభిమానులు ఆమెను తెరపై చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా, మోనాలిసా మొదటగా పబ్లిసిటీని తప్పించుకోవాలని భావించి తన వ్యాపారాన్ని మూసివేసి సొంతూరికి వెళ్లిపోయింది. కానీ నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచి, ఆమెని ప్రోత్సహించారు. దీంతో, తన కలల్ని నిజం చేసుకోవాలని ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
సామాజిక మాధ్యమాల్లో ఒక్కరోజులో ఫేమస్ అవ్వడం మామూలు విషయం కాదు. కానీ మోనాలిసా కథ అనూహ్యంగా మారిపోయింది. ఈ రాత్రికి రాత్రే వచ్చిన ఫేమ్ ఆమె జీవితాన్ని మారుస్తుందా? బాలీవుడ్‌లో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.