
టాలీవుడ్ యువ హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఆమె ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, మాజీ నటి లిస్సీ కుమార్తె. నటన మాత్రమే కాదు, కళ్యాణి కుటుంబం మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ కూడా సినీ ప్రపంచంలో పాపులర్ నటుడే.
2017లో అక్కినేని అఖిల్ సరసన “హలో” సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నటనకు రాకముందే, ఆర్కిటెక్చరల్ డిజైన్ చదివిన కళ్యాణి, సినిమా సెట్స్‌లో ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె విక్రమ్ నటించిన ఇరుముగన్, హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 వంటి చిత్రాల్లో అర్ధిక పాత్ర పోషించింది.
తెలుగులో ఆమె చేసిన చిత్రాలు వాణిజ్య పరంగా పెద్దగా విజయవంతం కాలేదు. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, మలయాళ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉంది. కానీ, ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కళ్యాణి, రెగ్యులర్‌గా తన క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా, తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు “క్యూట్ బేబీ కళ్యాణి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.